ప్రవృత్తి: పద్యం, గేయం, గద్యం,.నానీలు, రెక్కలు హై కూలు, కధలు, నాటికలు, మొ. న..అన్ని ప్రక్రియలలోను17 గ్రంథాలు రాశారు.
ఈనాడు అంతర్యామి రచయితగా సుపరిచితులు. 100కు పైగా సాంఘిక, పౌరాణిక నాటకాలలో నటించారు. ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో తుది న్యాయనిర్ణేతగా వ్యవహరించి, స్వర్ణ నంది అవార్డు పొందారు. 'నవరాగం-స్వరయాగం' పేరుతో 60నిమిషాలలో60పాటలు పాడి 6world Records అందుకున్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ గేయరచయిత పురస్కారం, భానుపురి సాహితీ వేదిక నుండి 'గేయరత్న' బిరుదు పొందారు. ఆకాశవాణి దూరదర్శన్ గాయకులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త,
అంతర్జాతీయ తెలుగు టోరీ రేడియోలో 4 సం. లుగా వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నారు. చిమ్మపూడి ఫౌండేషన్ నెలకొల్పి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'రాగావధానం' అనే వినూత్న ప్రక్రియ ను ఆవిష్కరించి57 ప్రదర్శనలిచ్చారు.
వీరు రాసిన గ్రంథాలలో ఒకటి డా. సి. నారాయణరెడ్డి గారికి, మరొకటి డా. అక్కినేని నాగేశ్వరరావు గారికి, మరొక గ్రంథం S. P. బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితమిచ్చారు. ఫౌండేషన్ .ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల లోను
తెలుగు భాషలో పోటీలు పెట్టి, బాలబాలికలకు పురస్కారాలిస్తున్నారు.